సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించిన శివకుమార్.. డీకేకు సిద్దూ ఆశీస్సులు!

  • కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయనున్నట్లు ఊహాగానాలు
  • మంత్రివర్గ సహచరులకు సిద్దరామయ్య అల్పాహార విందు
  • ఈ భేటీలో సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్
  • కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే నాయకత్వ మార్పు జరుగుతున్నట్లు ప్రచారం
  • రాజీనామా సమర్పణకు గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఏర్పడిన ప్రతిష్టంభన
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్య తప్పుకోనున్నారనే ఊహాగానాల మధ్య, ఆయన గురువారం తన అధికారిక నివాసంలో మంత్రివర్గ సహచరులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ పరిణామం రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుందన్న వార్తలకు మరింత బలాన్నిచ్చింది.

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్న డీకే శివకుమార్‌తో పాటు ఇతర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య.. డీకే శివకుమార్‌ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం శివకుమార్, సిద్దరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఫొటోలను విడుదల చేసింది.

కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందని, అందులో భాగంగానే శివకుమార్‌కు సీఎం పీఠం అప్పగించేందుకు సిద్దరామయ్య తప్పుకోనున్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విందు సమావేశంలోనే సిద్దరామయ్య తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

ఈ విషయంపై గురువారం స్పందిస్తానని సిద్దరామయ్య ఇప్పటికే తెలిపారు. తన రాజీనామా సమర్పించేందుకు ఆయన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. అయితే, గవర్నర్ వ్యక్తిగత పనుల నిమిత్తం ఇండోర్‌కు వెళ్లడంతో నగరంలో అందుబాటులో లేరని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో రాజీనామా ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.

Siddaramaiah
DK Shivakumar
Karnataka politics
Chief Minister Karnataka
Karnataka CM
Congress party
Thawar Chand Gehlot
Karnataka government
leadership change
Karnataka

More Telugu News